ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ప్రభుత్వ దోపిడీని ఎండగట్టాలి

ABN, First Publish Date - 2022-08-09T06:37:06+05:30

జగన్‌ ప్రభుత్వ దోపిడీని ఎండగట్టాలి

తిప్పనగుంటలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఆగస్టు 8 : ఎన్ని కల్లో ప్రజలపై హామీల వర్షం కురిపించి ఒక్కఛాన్స్‌ అంటూ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రతి నాయకుడు, కార్యకర్త ఎండగట్టాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. టీడీపీ తిప్పనగుంట  గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బాదుడేబాదడు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముద్దర బోయిన వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తిప్పనగుంట విచ్చేసిన నాయకులకు టీడీపీ శ్రేణులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటికీ పాదయాత్ర చేస్తూ పథకాల పేరుతోవైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, చార్జీల పెంపుతో చేస్తున్నదోపిడీలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభా  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రవేశ పెట్టిన అన్నక్యాంటీన్లు, పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ  పథకాలు రద్దు చేయాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఏముందన్నారు. ప్రతి కుటుంబాన్ని దోచుకుతింటున్న జగన్‌మోసపురెడ్డి ముఠాను నిలదీయాలని, వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా కూర్చో బెట్టడానికి టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దయా ల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌, దొంతు చిన్నా,  సాయిల నాగేశ్వరరావు, గూడవల్లి నరసయ్య, మూ ల్పూరి సాయి కల్యాణి, గరిమెళ్ల నరేంద్రనాఽఽథ్‌ చౌదరి, దండు సుబ్రహ్మణ్యం రాజు, గజ్జర్లపూడి బాబూరావు, జూపల్లి సురేష్‌, మొవ్వా వెంకటేశ్వరరావు, వడ్డిల్లి లక్ష్మి, జాస్తి వెంకటేశ్వరరావు చిరుమామిళ్ల సూర్యం,   వెంకయ్యారావు బోడపాటి రవికుమార్‌, ఏ. వెంకట కృష్ణారెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising