ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నసైజు రేకుల షెడ్డు ఇంటి పన్ను రూ.77,900

ABN, First Publish Date - 2022-05-21T06:40:58+05:30

చిన్నసైజు రేకుల షెడ్డు ఇంటి పన్ను రూ.77,900

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపల్లి మున్సిపల్‌ అధికారుల నిర్వాకం

చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని బెదిరింపు


ఫొటోలో ఉన్న చిన్న రేకుల షెడ్డును చూశారా? సరిగ్గా ఒక కుటుంబానికి కూడా సరిపోని ఈ చిన్న ఇంటికి కొండపల్లి మున్సిపల్‌ అధికారులు ఏకంగా రూ.77,900 ఇంటిపన్ను వేశారు. ‘ఇదేమిటి..? గతంలో తాము రూ.264 చెల్లించాం.’ అని ఆ ఇంటి యజమాని చెప్పినా అధికారులు ససేమిరా.. అంటున్నారు. కొండపల్లి గీతామందిర్‌ రోడ్డులోని రాపాని అంకరాజుకు చెందిన ఈ ఇంటికి ఇంత బిల్లు ఇవ్వడమే ఓ తప్పయితే, ఆ బిల్లు చెల్లించకపోతే జప్తు చేస్తామని బెదిరించడం మరో తప్పు. ఇదేమిటని రసీదు ఇచ్చిన వలంటీరును ప్రశ్నించగా, ‘అదేమి మాకు తెలియదు అధికారులు ఇవ్వమన్నారు.. ఇచ్చాం. పన్ను కట్టాల్సిందే..’ అని ఘంటా పథంగా చెప్పేశారు. లేకపోతే ఇంటిని జప్తు చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత కుటుంబం లబోదిబోమంటూ స్థానిక నాయకుల వద్దకు పరుగులు తీసింది.  - కొండపల్లి (ఇబ్రహీంపట్నం)

Updated Date - 2022-05-21T06:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising