ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వైసీపీలో వారసుల టెన్షన్.. సారీ చెప్పిన సీఎం జగన్

ABN, First Publish Date - 2022-09-30T17:41:15+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారసుల టెన్షన్ (Heirs Tension) మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారసుల టెన్షన్ (Heirs Tension) మొదలైంది. తమ పిల్లలకు టిక్కెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. దీంతో సీఎం జగన్ (CM Jagan) వారికి సారీ చెప్పేస్తున్నారు. అధినేత తీరు కొందరు సీనియర్లకు టెన్షన్ పుట్టిస్తోంది. వారు తమ ప్రయత్నాలు మాత్రం వదులుకోవడంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయింది. అందులో చాలా మంది నేతలకు మాత్రం మూడు పదులకుపైగా రాజకీయ జీవితం గడిచిపోయింది. ఇక తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇవ్వాలన్న కోరిక వారిలో పెరిగిపోయింది. అలా కోరుకుంటున్నవారు కనీసం 15 మంది ఉంటారని అంచన. అయితే ఈసారి గెలుపోటముల మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉంటుందని సర్వే సంస్థల నివేదికల నడుమ సీఎం జగన్ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.


బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాపులో వైసీపీ నేతల వద్ద ముఖ్యమంత్రి మనసులో మాటను బయటపెట్టారు. ఈసారి కూడా మీరే పోటీ చేయాలంటూ తెగేసి చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రులు బుగ్గన, బొత్స సహా పలువురు తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించారు. కొందరైతే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వారసులనే తిప్పుతున్నారు. దీనిపై జగన్ సీరియస్ అయ్యారు. వారసులను తిప్పితే అది లెక్కలోకి రాదని, నెలకు 16 రోజులు ఖచ్చితంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు.


ముఖ్యమంత్రి మాట ఎలా ఉన్నా తాము మాత్రం వారసులను రంగంలోకి దింపుతామని చెబుతున్న సీనియర్లు సీఎం జగన్‌ను ఏదో విధంగా ఒప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ మాత్రం రిస్క్ తీసుకోదలచుకోలేదు. పార్టీ నేతలు మాత్రం నెక్ట్స్ జనరేషన్ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2022-09-30T17:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising