ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా డీవైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం

ABN, First Publish Date - 2022-11-02T00:20:21+05:30

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణలంక 21, 22 డివిజన్లలో మంగళవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా డీవైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం

కృష్ణలంక, నవంబరు 1 : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణలంక 21, 22 డివిజన్లలో మంగళవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2 కోట్ల సభ్యత్వంతో దేశంలోనే అత్యంత పెద్ద యువజన సంఘంగా డీవైఎఫ్‌ఐ ఉందన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో సుమారు 9 లక్షల ఖాళీ పోస్టులు వున్నాయని, తక్షణమే వాటిని భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ పోరాడుతుందన్నారు. వేలాది మంది నిరుద్యోగులతో ఈ నెల 3న చలో ఢిల్లీ పిలుపునిచ్చామన్నారు. నిరుద్యోగులతో పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో వున్న యువత ఈ ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణ, తూర్పు నగర అధ్యక్షుడు బత్తుల ఉమామహేశ్వరరావు, డివిజన్‌ అధ్యక్షుడు కొండ, నాయకులు కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T00:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising