ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP అధికారంలోకి వస్తేనే AP అభివృద్ధి సాధ్యం: GVL

ABN, First Publish Date - 2022-06-06T19:56:17+05:30

APలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ జీవీఎల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: APలో బీజేపీ (BJP) అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ జీవీఎల్ (GVL) నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. వారి సొంత అజెండా తప్పితే రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీని బలీయమైన శక్తిగా నిర్మించాలన్న కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా రెండు రోజులపాటు ఉంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలనే తీవ్రమైన సంకల్పం జాతీయ నాయకత్వంలో నెలకొందన్నారు. బీజేపీ, జనసేన కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అధికారంలోకి రావాలన్నదే తమ ఆలోచన అని, ఆ ప్రకారమే కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు వెళతామని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని జీవీఎల్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-06T19:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising