ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Casino Episode: మరోసారి తెరపైకి గుడివాడ క్యాసినో వ్యవహారం

ABN, First Publish Date - 2022-12-19T12:40:50+05:30

విజయవాడ: గుడివాడ క్యాసినో వ్యవహారం (Gudivada Casino Episode) మరోసారి తెర మీదకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గుడివాడ క్యాసినో వ్యవహారం (Gudivada Casino Episode) మరోసారి తెర మీదకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వర రావు, బోండా ఉమ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్ళారు. క్యాసినో వ్యవహారంపై వివరాలు అందజేయాలని ఐటీ అధికారులు కోరడంతో టీడీపీ బృందం (TDP Leaders) కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నిజ నిర్దారణ కమిటీ సేకరించిన నివేదికను కూడా ఐటీ అధికారులకు ఇవ్వనున్నారు.

గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌పై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది. గుడివాడ క్యాసినో అంశంపై గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీలపై వివిధ సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేసింది. సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ ఫిర్యాదుపై ఐటీ శాఖ స్పందించింది. సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యను ఐటీ అధికారులు పిలిచారు. ఈ నేపథ్యంలో సోమవారం టీడీపీ బృందం విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని గతంలో టీడీపీ ఆందోళనలు కూడా చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-19T12:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising