ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశెనగ రైతును ఆదుకోండి

ABN, First Publish Date - 2022-10-17T06:48:35+05:30

: భారీ వర్షాల కారణంగా ముంపునకు గురై నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ డిమాండ్‌

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 16 : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురై నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని గోపువానిపాలెం, మేకావానిపాలెం, కొత్తపూడి, మంగినపూడి గ్రామాల్లో ముంపునకు గురై దెబ్బతిన్న వేరుశెనగ పొలాలను కొనకళ్ల,   రవీంద్ర, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పరిశీలించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, టీడీపీ హయాంలో ప్రకృతి వైపరీత్యా లు సంభవించినపుడు రైతులకు నష్టపరిహారం చెల్లించారన్నారు. వైసీపీ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో విఫలమవుతోందన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, ఎకరాకు రూ. 45 వేల చొప్పున పెట్టుబడి పెట్టి వేరుశెనగ రైతులు పంట నాటారని, మొక్క  మొలిచి కుదేలయ్యారన్నారు. నష్టపోయిన రైతులను వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శించడం లేదన్నారు. టీడీపీ మచిలీపట్నం పార్లమెం టు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ, బందరు మండలంలో వేరుశెనగ పంట పండిస్తూ చాలా మంది సన్న, చిన్నకారు రైతులు జీవనం సాగిస్తున్నారని, పంట నష్టపోవడం తో రైతులు అప్పుల పాలయ్యారన్నారు.   బందరు రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు కుంచే నాని, తెలుగు యువత మచిలీపట్నం పార్లమెంటు నాయకుడు వాలిశెట్టి విమనేష్‌, తెలుగు విద్యార్థి నాయకులు పాలపర్తి అభినవ్‌, నాయకులు వాలిశెట్టి తిరుమలరావు, మెండు భానుమూర్తి, కె.పి.రామస్వామి, పరసా పెంటయ్య, పరింకాయల శేఖర్‌, శివాజీ, రాధాకృష్ణ, మాదిరెడ్డి చంద్రశేఖర్‌, అంజిబాబు, కొత్తపూడి గ్రామ ఉపసర్పంచ్‌ బొల్లా నాగబాబు, కేసన వాకాలయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-17T06:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising