పర్యవేక్షణాధికారి ఏరీ?
ABN, First Publish Date - 2022-10-17T06:32:31+05:30
స్థానిక ప్ర భుత్వాసుపత్రిలో సీఎ్‌సఆర్‌ఎంవో పోస్టు ఖాళీ అయి నేటికి 8 నెలలు కావొస్తున్నా కొత్తవారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరగుతోంది.
8 నెలలుగా భర్తీ కాని సీఎ్‌సఆర్‌ఎంవో పోస్టు
పర్యవేక్షణ లోపంతోనే గతంలో మహిళపై లైంగికదాడి
అన్నీ తానై నడిపిస్తున్న ఇన్‌చార్జి
ఆసుపత్రి నిర్వహణ అంతంతమాత్రమేనా.. రోగుల ఆరోపణ
విజయవాడ అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ప్ర భుత్వాసుపత్రిలో సీఎ్‌సఆర్‌ఎంవో పోస్టు ఖాళీ అయి నేటికి 8 నెలలు కావొస్తున్నా కొత్తవారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరగుతోంది. గతంలో సీఎ్‌సఆర్‌ఎంవోగా విధులు నిర్వహించిన డాక్టర్ హనుమంతరావు కాకినాడ జిల్లా వైద్యశాఖధికారిగా వెళ్లినప్పటి నుంచి ఆ స్థానం భర్తీ కాలేదు. త రువాత భీమవరం వైద్యశాఖాధికారి వెంకటేశ్వరరావును ని యమించినట్టు తొలుత ఉత్తర్వులు వచ్చానా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో ఆ పోస్టు ఖాళీగానే మిగిలిపోయింది. త్వరగా పోస్టును భర్తీ చేయాలని అధికారులు కలెక్టర్‌కు లేఖలు పంపినా అశ్రద్ధ వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5నెలల క్రితం ఆసుపత్రిలో మతిస్థితిమి తం లేని మహిళపై లైంగికదాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. పర్యవేక్షణ కొరవడటమే అందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇన్‌చార్జ్ పేరుతో ఆ అధికారి అన్నీ విభాగాలను తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారని తెలిసింది. ఆమె అనధికార సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ఆసుపత్రి నిర్వహణ ఘోరంగా ఉందని రోగులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో నిఘా కొరవడిందని కొందరు అధికారులు పెదవి విరుస్తున్నారు. సీఎ్‌సఆర్‌ఎంవో పోస్టును భర్తీ చేస్తే ఆసుపత్రి నిర్వహణ పర్యవేక్షణ మెరుగుపడుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-10-17T06:32:31+05:30 IST