ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుద్రోహి జగన్‌ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-06-28T06:56:05+05:30

వైసీపీ ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తోందని మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు.

తాళ్లపాలెం గ్రామంలో బాదుడే బాదుడు నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గోపు సత్యనారాయణ ధ్వజం

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 27 : వైసీపీ ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తోందని మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం తాళ్లపాలెం గ్రామంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అప్రకటిత విద్యుత్‌ కోత వల్ల ఆక్వా రంగం దెబ్బతిందన్నారు.  కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించలేదన్నారు. ఖరీఫ్‌ వచ్చినా ఎరువులు, విత్తనాల సరఫరా చేయడం లేదని, కాల్వ చివరి భూములకు సాగునీరందించలేదని దుయ్యబట్టారు.  లంకే శేషగిరి, మెండు భానుమూర్తి, కొనకళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 29న అంగలూరులో, 30న మచిలీపట్నంలో జరిగే చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, బందరు రూరల్‌ మండల అధ్యక్షుడు కుంచే నాని పిలుపునిచ్చారు.  గుండుపాలెం తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు విస్తృతంగా పర్యటించారు.  తెలుగు యువత నాయకులు తూమాటి బసవయ్య పాల్గొన్నారు.

చేవేండ్రలో బాదుడే బాదుడు  

 పెడన రూరల్‌ : వైసీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల కుప్ప చేసిందని, ప్రజలపై పెనుభారాలు మోపిందని  జడ్పీటీసీ సభ్యు డు  అర్జా వెంకట నగేష్‌ విమర్శించారు.  చేవేండ్ర గ్రామంలో సోమవారం టీడీపీ  ఆఽధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. శలపాటి ప్రసాద్‌, శీరం ప్రసాద్‌, ఉమ్మడి శెట్టి శ్రీరాములు, పండ్రాజు హరిబాబు, శేఖర్‌, పైడేశ్వరరావు. చిన సుబ్బారావు,  హరనాధ్‌, కాగిత వాసు, నల్లమోతు గాంధి, కృష్ణ, రాంబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.  



Updated Date - 2022-06-28T06:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising