ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోమాత కష్టం ఎవరికి పట్టేను..!

ABN, First Publish Date - 2022-12-16T01:28:24+05:30

గోమాతకు కష్టం వ చ్చింది.. గాలిలో వ్యాపించే చర్మ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న గోమాతలను పట్టించుకునే నాథుడు లేక ఆ మూగజీవాలు అల్లాడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబ్బీపేట, డిసెంబరు 15: గోమాతకు కష్టం వ చ్చింది.. గాలిలో వ్యాపించే చర్మ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న గోమాతలను పట్టించుకునే నాథుడు లేక ఆ మూగజీవాలు అల్లాడుతున్నాయి. రోడ్లపై ఆలనా పాలన లేక దొరికింది తింటూ రోడ్లనే నివాసాలుగా చేసుకున్న గోవులకు మాయదారి జబ్బు అంటుకుని అతలాకుతలం చేస్తుంది. వాటిని చూసిన ప్రతి ఒక్క రూ అయ్యో పాపం అనడం తప్ప ఏం చేయలేక ప్ర భుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ స్పందించాలని కోరుతున్నారు. కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో కొన్ని ఆవులు సంచరిస్తున్నాయి. వీటిలో కొన్నింటికి చర్మంపై పుండ్లులా ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై ఎవరూ స్పందించకపోవడం తో ఒకదాని తరువాత మరోదానికి వ్యాపిస్తోంది. ఆ వులు రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తిం టుంటాయి. కానీ వీటికి వచ్చిన వ్యాధి కారణంగా వా టి దగ్గరకి వెళ్లడానికి వెనకాడుతున్నారు. వీటి యజమాని ఎవరో తెలియకపోవడంతో సమస్యపై స్పందించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. గో సంరక్షణ సంస్థ సభ్యులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు బాధ్యత తీసుకుని వాటిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యాక్సినేషన్‌ చేయాలి : జీఎన్‌ఆర్‌ ఠాగూర్‌,

ఎన్టీఆర్‌ వెటర్నరీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి జేడీ

నగరంలో ఆవులకు వస్తున్న ఈ వ్యాధిని లంపి స్కిన్‌ సమస్య అంటారు. ఈ సమస్యను నివారించాలంటే ఆవులకు వ్యాక్సినేషన్‌ అవసరం. వాటి యజమానులు సంప్రదిస్తే వ్యాక్సినేషన్‌ ఉచితంగా వేస్తా, రోడ్లపై సంచరించే వాటికి కూడా ఎవరైన బాధ్యత తీసుకుంటే వాక్సినేషన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యాధి గాలి ద్వారా సంభవిస్తుంది.

స్వచ్ఛంద సంస్థలు రావాలి : గో ప్రేమికులు

గోవులను ఈ వ్యాధి నుంచి కాపాడడంలో మున్సిపల్‌ అధికారులు గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ ముం దుకురావాలి. పశువైద్యులు వాటికి వ్యాక్సినేషన్‌ వేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో అత్యవసరంగా చికిత్స అందిస్తే వాటిని కాపాడినట్టు అవుతుంది.

Updated Date - 2022-12-16T01:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising