ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోలో రూ.10లక్షల బంగారం!

ABN, First Publish Date - 2022-08-10T06:31:59+05:30

ఆటోలో ప్రయాణికులు బ్యాగ్‌ మరచిపోయారని తెలిసినా వేగంగా వెళ్లిపోయి రూ. 10లక్షల విలు వైన బంగారు వస్తువులను తన వద్ద పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు ఐదు గంటల్లో పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు గంటల్లో ఛేదించిన పోలీసులు

విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఆటోలో ప్రయాణికులు బ్యాగ్‌ మరచిపోయారని తెలిసినా వేగంగా వెళ్లిపోయి రూ. 10లక్షల విలు వైన బంగారు వస్తువులను తన వద్ద పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు ఐదు గంటల్లో పట్టుకున్నారు. చెన్నైకి చెందిన టోట యువరాజ్‌ సునీల్‌ కుటుం బ సభ్యులతో కలిసి నగరంలో జరిగే బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉండవల్లిలో ఆటో ఎక్కి గురునానక్‌ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపానికి మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఆటో దిగే క్రమంలో బ్యాగ్‌ను మరిచిపోయారు. అందులో 205 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు పట్టుచీరలు, రూ.4వేలు ఉన్నాయి. పాయకాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ పోకల మురళీ బ్యాగ్‌ ను గుర్తించినా ప్రయాణికులకు ఇవ్వలేదు. పై గా అక్కడే మరో ప్రయాణికులను ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోయాడు. బ్యాగ్‌ మరచిపోయినట్టు గుర్తించిన యువరాజ్‌ సునీల్‌ డయ ల్‌ 100కు కాల్‌ చేశారు. పటమట క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఆటో నంబర్‌ ను సంపాదించారు. దాని ఆధారంగా దర్యాప్తు చేయగా ఆటో పాయకాపురంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. నిందితుడు మురళీని అరెస్టు చేసి, అతడి నుంచి మొత్తం ఆభరణాలు, వస్తువులను స్వాఽధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-08-10T06:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising