ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలు తగ్గించేదాకా ఉద్యమిస్తాం

ABN, First Publish Date - 2022-07-07T05:52:44+05:30

వంటగ్యాస్‌పై ఉన్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిన నరేంద్ర మోడీ నేృత్తంలోని కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు వేల కోట్లు రాయితీలు ఇస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు సిహెచ్‌ బాబూరావు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు బాబూరావు 

 గ్యాస్‌ ధర పెంపునకు నిరసనగా గ్యాస్‌ బండలతో ధర్నా 

గవర్నర్‌పేట, జూలై 6 : వంటగ్యాస్‌పై ఉన్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిన నరేంద్ర మోడీ నేృత్తంలోని కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు వేల కోట్లు రాయితీలు ఇస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు సిహెచ్‌ బాబూరావు ధ్వజమెత్తారు. మరోసారి కేంద్రంలోని బిజెపీ ప్రభుత్వం వంటగ్యాస్‌ సిలెండర్‌ ధర్‌ రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బీసెంట్‌ రోడ్డు మహంతి మార్కెట్‌ సమీపంలో ధర్నా జరిగింది. ధరల పెంపునకు నిరసనగా సీపీఎం కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. బాబూరావు మాట్లాడుతూ గడచిన 8 సంవత్సరాల్లో వంటగ్యాస్‌ ధర రూ.400 నుంచి రూ.1100 రూపాయలకు పెంచిన పాపం బిజెపీ, మోడీలదే అన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి, 8 ఏళ్ళలో అదుపు చేయలేనంతగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని అన్నారు. గత 8 సంవత్సరాలుగా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌పై పన్నుల ద్వారా రూ. 25 లక్షల కోట్ల రూపాయల భారాన్ని దేశప్రజలపై మోడీ మోపారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌, సిఐటియూ నాయకులు కె. దుర్గారావు, వై. సుబ్బారావు, లక్ష్మణ, మురళీ, భూలోకం పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T05:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising