ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పోలీస్ కమిషనర్‌‌ను కలిసిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2022-09-05T20:36:56+05:30

చెన్నుపాటి గాంధీ కేసు విషయమై టీడీపీ నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): చెన్నుపాటి గాంధీ (Chennupati Gandhi) కేసు (Case) విషయమై ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ (Gadde Rammohan), పలువురు టీడీపీ నేతలు (TDP Leaders) సోమవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ (CP)‌ను కలిశారు. పోలీసులు కేసు నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మారణాయుధాలతో దాడి చేస్తే 307 హత్యాయత్నం నమోదు చేయకుండా నామమాత్రపు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో చెప్పినదానికి, పోలీసులు చెబుతున్న దానికి పొంతన లేదని అన్నారు.


ఈ సందర్బంగా గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నంపై సీపీకి పిర్యాదు చేశామని చెప్పారు. విజయవాడ తూర్పులోనే ఘటనలు జరగడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. గాంధీపై హత్యాయత్నం చేసిన వాళ్ల అందరిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు చెప్పారు. ప్రశాంతమైన విజయవాడలో గాంధీపై దాడితో మళ్ళీ అలజడి మొదలు అయిందన్నారు. అనుకోకుండా జరిగిన గొడవ కాదని.. ఓ పధకం ప్రకారం జరిగిన దాడి అని అన్నారు. గాంధీని లేకుండా చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీపీ చెప్పారని గద్దె రామ్మోహన్ తెలిపారు.

Updated Date - 2022-09-05T20:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising