ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former MLC: టీచర్లు చేసిన తప్పేంటో జగన్ చెప్పాలి

ABN, First Publish Date - 2022-11-30T11:15:40+05:30

తనను ఓడిస్తారన్నభయంతోనే జగన్ రెడ్డి టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేశారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తనను ఓడిస్తారన్నభయంతోనే జగన్ రెడ్డి టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేశారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ (Former MLC AS Ramakrishna) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయులు చేసిన తప్పేంటో ముఖ్యమంత్రి జగన్(AP CM Jagana Mohan Reddy)) చెప్పాలని డిమాండ్ చేశారు. మెరుగైన ఫిట్ మెంట్ కావాలని, డీఏలు సకాలంలో ఇవ్వాలని, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేయాలని కోరడమే వారితప్పా అని నిలదీశారు. ఎన్నికల్లో ఏనేరం ఘోరం చేయడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిసాయంతో అక్రమాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హామీలతో మోసపోయిన ఒక్కో టీచర్ 1000 మందిని ప్రభావితం చేయగలడని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.

జీవో 117తో స్కూళ్లను ఏవిధంగా నాశనంచేస్తున్నారో... ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని ప్రభుత్వ పనితీరుని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి పుట్టకముందే టీచర్లు ఎన్నికల విధుల్లో ఉన్నారని గుర్తుచేశారు. ‘‘మద్యం దుకాణాల ముందు టీచర్లను కాపలాపెట్టడం ఎలాంటిపని?.. మరుగుదొడ్ల ఫొటోలు తీయించడం ఉపాధ్యాయులు చేయాల్సిన పనా?’’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ యాప్‌ల నిర్వహణ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం టీచర్లను ఎందుకు ఒత్తిడి చేసిందని ఏఎస్‌ రామకృష్ణ ప్రశ్నలు కురిపించారు.

Updated Date - 2022-11-30T11:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising