ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతా శిశు మరణాలపై దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-12-16T01:10:38+05:30

గర్భిణుల్లో హైరిస్క్‌ డెలివరీలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు పాటించడం ద్వారా మాతా శిశు మరణాలు నివారించాలని, కిశోర బాలికలు గర్భిణులు ఐరన్‌ టాబ్‌లెట్లను తప్పనిసరిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు.

వృద్ధ కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌పేట, డిసెంబరు 15 : గర్భిణుల్లో హైరిస్క్‌ డెలివరీలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు పాటించడం ద్వారా మాతా శిశు మరణాలు నివారించాలని, కిశోర బాలికలు గర్భిణులు ఐరన్‌ టాబ్‌లెట్లను తప్పనిసరిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం వైద్యాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాలను పూర్తిస్థాయిలో నివారించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 20 ఏళ్ల లోపు గర్భిణులను గుర్తించి వారి ఆరోగ్యంపై పూర్తి సమాచారం సేకరించి పొందుపర్చాలన్నారు. వారికి వైద్యం అందించడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావాలని కోరారు. రక్తహీనతను నివారించేందుకు యుక్త వయస్సు నుంచే బాలికలకు ఐరన్‌ టాబ్‌లెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైరిస్క్‌ డెలివరీలను గుర్తించి ఎప్పటికప్పుడు జాబితా సమర్పించాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వై.నళినిదేవి, పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ కళ్యాణి, డాక్టర్‌ సుమ, డాక్టర్‌ దివిజ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ భాగస్వామ్యం అభినందనీయం..

విద్యారంగ అభివృద్ధికి ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అభినందనీయమని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాల భోజనశాల అభివృద్ధికి రామ్‌కో ఇండస్ట్రీస్‌ ఏజీఎం పి.ఆనందరావు రూ.లక్ష విరాళాన్ని గురువారం కలెక్టర్‌కు అందజేశారు.

కళాకారులకు గుర్తింపు కార్డులు

దరఖాస్తు చేసుకున్న జిల్లాకు చెందిన పలువురు వృద్ధకళాకారులకు గురువారం గుర్తింపు కార్డులను అందజేశారు. కార్డుల ద్వారా కళాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు 13 దరఖాస్తులు రాగా తొమ్మిది మందికి కార్డులు మంజూరు చేసినట్టు చెప్పారు.

Updated Date - 2022-12-16T01:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising