ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-12-13T01:53:49+05:30

వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేననీ, కానీ ప్రజా ప్రతి నిధులు, అధికారులు రైతులకు మేమున్నామనే భరోసా ఇవ్వలేకపోయారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రాముడుపాలెంలో వరి పంటను పరిశీలిస్తున్న మండలి బుద్ధప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నదాతలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: మండలి బుద్ధప్రసాద్‌

చల్లపల్లి, డిసెంబరు 12: వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేననీ, కానీ ప్రజా ప్రతి నిధులు, అధికారులు రైతులకు మేమున్నామనే భరోసా ఇవ్వలేకపోయారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని రాముడుపాలెం, మేకావారిపాలెం, పురిటిగడ్డ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్య టించారు. నీటిముంపులో ఉన్న వరిపనలు, నేల వాలిన వరిపైరు, ముందుకు కదలని డ్రెయిన్లను ఆయన పరిశీలించారు.

డ్రెయినేజీలు తవ్వకుండానే బిల్లులు

డ్రెయినేజీ సమస్యలను రైతులు బుద్ధప్రసాద్‌కు తెలిపారు. అధికార పార్టీనేతలు నియోజకవర్గంలో ఇరిగేషన్‌, డ్రెయినేజీ వ్యవస్థను గుత్తాధిపత్యం కింద ఒకరిచేతిలో పెట్టారని, డ్రెయినేజీలు తవ్వ కుండా తవ్వినట్లు బిల్లులు పెట్టుకుంటున్నారని బుద్ధప్రసాద్‌ ఆరోపించారు. రెండు రోజులుగా మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో డ్రెయిన్ల దుస్థితిని ప్రత్యక్షంగా చూశామన్నారు. డ్రెయినేజీలు ఎక్కడ తవ్వారని ప్రశ్నించారు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు. కౌలు రైతుల్లో బడుగు, బలహీనవర్గాలు, పేద వర్గాలే అత్యధికులని, వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉందని బుద్ధప్రసాద్‌ తెలిపారు. ‘‘ప్రభుత్వం రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలి. రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనాలి. మినుము విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలి. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలి. అధికా రులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టం అం చనా వేయాలి. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పరచాలి.’’ అని బుద్ధప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఆంక్షలు పెడు తోందని, కనీసం సంచులు ఇవ్వలేని స్థితి ఉందని ఆయన వాపోయారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయరాధిక, చల్లపల్లి సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు రాజులపాటి అంకమ్మ, మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాస రావు, నిడమానూరి దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising