రైతులను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2022-10-17T07:00:33+05:30
రైతులను ఆదుకోవాలి
కొటికలపూడి/చిలుకూరు(ఇబ్రహీంపట్నం), అక్టోబరు 16: అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను గుర్తించి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని కొటి కలపూడి, చిలుకూరు, దాములూరు, మూలపాడు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను రైతులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వలన క్యాలీఫ్లవర్, బీర, మొక్కజొన్న, మినుము, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. క్యాలీఫ్లవర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఎకరాకు రూ.1.50లక్షల ఆదా యం వచ్చే ఆవకాశం ఉందని కానీ వర్షం కారణంగా పంట దెబ్బ తిం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తాడేపల్లిలో చేతులు కట్టుకుని కూర్చుని చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఏసీ గదుల్లో ఉండే అధికారులు బయటకు వచ్చి రైతుల కష్టాలు పట్టించుకోవాలని కోరారు. పత్తి, టమాటా, బెండ పంటలు మూడేళ్లుగా రైతు చేతికి రాకు ండా పోతున్నాయన్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లోకి రావాలని రైతులకు భరోసా కల్పించాలని అన్నారు. రామి నేని రాజశేఖర్, సైకం సాంబశివరావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆటవిక పాలన
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శిం చారు. కొండపల్లిలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని సీఐడీ అధికారులతో వేధిస్తున్నారని, కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మార్చు కోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడు కోసం భోగాపురం వద్ద రహదారి ఎలైన్మెంట్ మా ర్చారన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను విశాఖ హోటల్లో నిర్బంధించటం సిగ్గుచేటన్నారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన మైలవరం ఎమ్మెల్యే ఇసుక దోపిడీ, ఎన్టీటీపీఎస్ కెనాల్‌ను విధ్వంసం చేస్తున్నా రని విమర్శించారు. 40 టన్నులు ఇసుక లారీని 11 అడుగుల వంతెన ద్వారా తరలించేస్తున్నారని, వంతెన కూలిపోతే గొలపూడి కరకట్ట వాసుల పరిస్థితి ఏంటన్నారు. రామినేని రాజశేఖర్, చెన్ను బోయిన చిట్టి బాబు, కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టుకుదురు వాసు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T07:00:33+05:30 IST