ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘TDP కోసం అవసరమైతే చస్తాను: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

ABN, First Publish Date - 2022-05-20T20:44:49+05:30

‘టీడీపీ కోసం అవసరమైతే చస్తానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన టీడీపీ మినీ మహానాడలో ఆయన మాట్లాడారు. మహానాడుకు హాజరైన వారిలో మాజీ మంత్రులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘టీడీపీ కోసం అవసరమైతే చస్తానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన టీడీపీ మినీ మహానాడలో ఆయన మాట్లాడారు. మహానాడుకు హాజరైన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర,  టీడీపీ నేత దివ్యవాణి, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, యర్రపతినేని శ్రీనివాసరావు, జయమంగళ వెంకటరమణ, పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మహానాడులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానిపై అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని, నేడు చంద్రబాబును విమర్శిస్తాడా?.శ్రీకాకుళం వచ్చి సన్న బియ్యం ఇస్తానని, రెండేళ్ళ తర్వాత మాట మార్చిన ఘనుడు నాని. పేకాట క్లబ్ నడిపి, క్యాసినో నిర్వహిస్తూ డబ్బులు కుప్పేసుకున్న చరిత్ర నానిది. నాపై11 కేసులు పెట్టారు. ఈ వయసులో నాపై రేప్ కేసు పెడ్డడం బాధాకరం. నేను ఎవరికి భయపడే రకం కాదు. రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్న జగన్ కు రోజులు దగ్గరపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మూడేళ్లు పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. నేడు మెడలో కండువాలు వేసుకొని గడప గడపకు వెళ్లడం హాస్యాస్పదం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, ఎన్టీఆర్ రుణం తీర్చుకోవాలి’ అని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మహానాడు ప్రతి టీడీపీ కార్యకర్తకు పండుగ లాంటిదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై వందలాది అక్రమ కేసులు పెట్టారు. వాటికి భయపడేది లేదన్నారు. టీడీపీ నేత దివ్యవాణి ప్రసంగిస్తూ.. గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామన్నారు. క్యాషినోనాని గుడివాడలో రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-20T20:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising