ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూట్‌మ్యాప్‌లో ఉన్నా రాలేదు!

ABN, First Publish Date - 2022-08-07T07:08:57+05:30

రూట్‌మ్యాప్‌లో ఉన్నా రాలేదు!

కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడే విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మా సమస్యలు తెలుసుకోనప్పుడు  ‘గడప గడపకు’ ఎందుకు?

రూట్‌మ్యాప్‌లో ఉన్న కట్టరోడ్డు వైపు రాకుండా, సమస్యలు తెలుసుకోకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎవరికోసం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మా దుస్థితి పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేకు చెప్పుకొందామంటే ఆయన రాకుండా వెళ్లిపోయారు. అలాంటప్పుడు ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

- భవానీశంకర్‌, స్థానిక వైసీపీ నాయకుడు 





 పెజ్జోనిపేట కట్టరోడ్డు ప్రాంతంలో ‘గడప గడపకు’ వెళ్లని ఎమ్మెల్యే వెలంపల్లి 

సమస్యలపై నిలదీస్తామని పర్యటించలేదంటున్న స్థానికులు 

పెజ్జోనిపేట, ఆగస్టు 6: రూట్‌మ్యాప్‌లో ఉన్న కట్టరోడ్డు వైపు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు రాకుండా, తమ సమస్యలను తెలుసుకోకుండా, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు నిర్వహి స్తున్నారని పెజ్జోనిపేట కట్టరోడ్డు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 35వ డివిజన్‌ పెజ్జోనిపేట ప్రాంతంలోని అల్లావుద్దీన్‌ వీధి, ఆర్‌సీఎం చర్చి వీధి, వంగర సుందర్‌రావు వీధి ప్రాంతాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెలంపల్లి నిర్వహించారు. 220వ వార్డు సచివాలయం పరిధి లోని కట్టరోడ్డు ప్రాంతం రూట్‌మ్యాప్‌లో ఉన్నా అటుగా ఎమ్మెల్యే రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టరోడ్డు ప్రాంతంపై స్థానిక కార్పొ రేటర్‌ తన యుడికి ఎందుకు ఇంత కక్ష, ఎమ్మెల్యేను నిలదీస్తామని తమ ఇళ్లకు రాలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పారి శుధ్య వ్యవస్థ దారుణంగా ఉందని, డ్రెయిన్లలో మురుగు పారుదల కాక ఇళ్లలోకి చేరుతుందని కొంతమంది స్థాని కులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడే పారిశుధ్య సిబ్బంది పనులు చేపట్టారని, నాయకులు వస్తున్నారనే ఈ హడావుడి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు రావడం లేదని, టిడ్కో డిపాజిట్లు రావాలని, ఇల్లు లేదని, మంచినీటి సమస్య ఉందని పలువురు తమ సమ స్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పోలిమెట్ల శరత్‌బాబు, బాల, సుజాత, మంచాల రాజు, శివ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T07:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising