ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-09T05:52:04+05:30

విద్యుత్‌ వినియోగదారులు, రైతులు, ఉద్యోగులు, ఇంజనీర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపే విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎన్టీటీపీఎస్‌ విద్యుత్‌ ఉద్యోగులు జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీటీపీఎస్‌ మెయిన్‌ గేట్‌ ఎదుట విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ధర్నా

ఎన్టీటీపీఎస్‌ (ఇబ్రహీంపట్నం), ఆగస్టు 8 : విద్యుత్‌ వినియోగదారులు, రైతులు, ఉద్యోగులు, ఇంజనీర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపే విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎన్టీటీపీఎస్‌ విద్యుత్‌ ఉద్యోగులు జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాన్ని నిరసిస్తూ సోమవారం ఎన్టీటీపీఎస్‌ గేట్‌ ఎదుట జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌, ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజనీర్‌ ఫెడరేషన్‌లు ఉమ్మడిగా విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖకు తెలియజేసినా, సంప్రదింపులు జరిపినా దీనిపై స్పందించకుండా వర్షాకాలం పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ఆమోదింపజేయాలని చూడటం దుర్మార్గం అన్నారు. ఒకవేళ అదే కనుక జరిగిగే సేవ్‌ పవర్‌ సెక్టార్‌-సెవ్‌ ఇండియా పిలుపుతో దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజలను, ఉద్యోగులను మభ్యపెట్టి విద్యుత్‌ సంస్థలు ప్రైవేటీకరణ అనుకూలంగా ప్రభుత్వం పార్లమెంట్‌లో విద్యుత్‌ సవరణ బిల్లు తీసుకువస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీధర్‌, వెంకటేశ్వరరావు, పర్వతనేని సాంబశివరావు, నరసింహరావు, పి.రాధకృష్ణ, ప్రశాంత్‌ కుమార్‌, వాసు దేవన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising