ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధులను బాధ్యతగా చూసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-02T05:46:08+05:30

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించే సామర్థ్యం ఉండి పోషించకుంటే వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయని

మైలవరం న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి షిరీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయమూర్తులు

మైలవరం, అక్టోబరు 1: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించే సామర్థ్యం ఉండి పోషించకుంటే వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి షేక్‌ షిరీన్‌ అన్నారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విశ్రాంత ఉద్యోగులభవనంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి మాట్లాడుతూ  వృద్ధాప్యం శాపం కాదన్నారు. వృద్ధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రమేష్‌, మైలవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముల్లంగి రవికుమార్‌, న్యాయవాదులు జి.శ్రీనివాస రావు, బుద్ధవరపు వెంకట్రావు, ఆర్‌.రమేష్‌బాబు పాల్గొన్నారు.


నందిగామ రూరల్‌:  మాగల్లు కేకే వృద్ధాశ్రమంలో  న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి జేసురత్నకుమార్‌  చట్టాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో ఏపీపీ ఈశ్వరప్రగడ రంగారావు, ఏజీపీ మట్టా ప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం, న్యాయవాదులు ఝాన్సీరాణి, రామకృష్ణ, కిషోర్‌,  హసీనాబేగం, కరిముల్లా పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising