ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథోత్సవాలతో ముగిసిన దసరా

ABN, First Publish Date - 2022-10-07T05:54:35+05:30

అమ్మవార్ల గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నకాసిబజార్‌లో కనకదుర్గమ్మ, చెరువుబజార్‌లో విజయదుర్గమ్మ రథోత్సవాన్ని,

జగ్గయ్యపేటలో అమ్మవారి రథాన్ని లాగుతున్న ఉదయభాను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట, అక్టోబరు 6: అమ్మవార్ల గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నకాసిబజార్‌లో కనకదుర్గమ్మ, చెరువుబజార్‌లో విజయదుర్గమ్మ రథోత్సవాన్ని, అద్దాల బజార్‌లోని మహాలక్ష్మీ రథోత్సవాన్ని ఉదయభాను దంపతులు లాగారు. భక్తులు  నృత్యాలు చేస్తు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.  పట్టణంలో పొట్టి శ్రీరాములు చౌక్‌లో కొప్పు కాంప్లెక్స్‌ వద్ద ఉన్న శమీ వృక్షాన్ని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, శ్రీరాం జయరాం, కొప్పు సుధాకర్‌, యర్రా వెంకటేశ్వర్లు, పేరం సైదేశ్వరరావు, గొట్టి నాగరాజు, పూజలు చేశారు.

నందిగామ రూరల్‌ :  సత్యమ్మ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, పూర్ణాహుతి నిర్వహించారు.  ఆలయ ఈవో నాగరాజు, చైర్మన్‌ ఆలోకం శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యుల పర్యవేక్షణలో సత్యమ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్‌ గరికపాటి భాస్కరం, దేవదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పల్లగిరి గట్టుపై   త్రిమాత లకు, లింగాలపాడులోని లక్ష్మీపేరంటాళ్లమ్మ ఆలయంలో, పట్ట ణంలోని సుకశ్యామలాంబ, వాసవీ కన్యకాపరమేశ్వరి. మరిడి మహాలక్ష్మీ అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చారు.  ఆలయాల్లో కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించారు. ఆలయాల వద్ద జరిగిన శమీపూజలో భక్తులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-07T05:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising