ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indrakeeladri: అమ్మవారి క్యాలెండర్‌ ఆలస్యం.. నిరాశలో భవానీలు

ABN, First Publish Date - 2022-12-16T20:03:03+05:30

నూతన సంవత్సరం గడియలు దగ్గర పడుతున్నాయంటే ప్రముఖ దేవాలయాలు క్యాలెండర్లు సిద్ధం చేస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లతోపాటు డైరీలు ముద్రిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నూతన సంవత్సరం గడియలు దగ్గర పడుతున్నాయంటే ప్రముఖ దేవాలయాలు క్యాలెండర్లు సిద్ధం చేస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లతోపాటు డైరీలు ముద్రిస్తుంది. ఈ విధంగా విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం క్యాలెండర్‌ (Sri Durga Malleswara Swamy)ను ముద్రిస్తుంది. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది దసరా నాటికి పూర్తవుతుంది. దసరా ఉత్సవాల తర్వాత వచ్చే భవానీ దీక్షల విరమణలో ఈ క్యాలెండర్లను విక్రయిస్తారు. ఈసారి దీక్షల విరమణకు వచ్చిన భక్తులు (devotees) క్యాలెండర్ల విషయంలో నిరాశకు లోనవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇప్పటి వరకు క్యాలెండర్లు (Calendars) సిద్ధం కాకపోవడమే.

ప్రతిసారీ పెర్గోల మండపాల వద్ద స్టాల్స్‌ ఏర్పాటు చేసి, క్యాలెండర్లను విక్రయించేవారు. ఈసారి అమ్మవారిని దర్శించుకుని బంధాలు విప్పించుకుని, హోమగుండాల్లో ద్రవ్యాలు వేసిన భక్తులు అమ్మవారి క్యాలెండర్ల కోసం తిరుగుతున్నారు. అక్కడున్న సిబ్బంది ఈ ఏడాది ఇంకా క్యాలెండర్లు సిద్ధం కాలేదని చెప్పడంతో భక్తులు నిరాశతో వెళ్లిపోతున్నారు. అమ్మవారి క్యాలెండర్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను ఖరారు చేయలేదు. ఇంకా డిజైన్లలో మార్పులు చేర్పుల దశలోనే ఉంది. ఫలితంగా ఈ ఏడాది దీక్షల విరమణకు వచ్చిన భక్తులు క్యాలెండర్‌ తీసుకోలేకపోయామన్న వెలితితో వెళ్తున్నారు.

Updated Date - 2022-12-16T20:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising