ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-11T07:46:42+05:30

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి ప్రాతఃకాలార్చన. స్నపన కార్యక్రమం దృష్ట్యా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, ఆగస్టు 10 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి ప్రాతఃకాలార్చన. స్నపన కార్యక్రమం దృష్ట్యా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం మండపారాధన, అగ్ని ప్రతిష్ఠాపన, సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించిన అనంతరం మూలవరులకు, ఉత్సవమూర్తులకు, ఉపాలయాలలో పవిత్ర మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా పరోక్ష, ప్రత్యక్ష ఆర్జిత సేవలను రద్దుచేశారు. నిత్య కైంకర్యాలను దేవస్థాన అర్చకులు నిర్వహిస్తారు. కాగా ఆగమశాస్రం మేరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం ఆలయంలో ఉదకశాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో భ్రమరాంబ, స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, వేదపండితులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T07:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising