ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2022-08-10T06:44:42+05:30

డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి కృషి

డ్రెయిన్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, ఆగస్టు 9 : డ్రెయినేజీ  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ట్లు సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య అన్నారు. స్థానిక ముస్లిం పేట దగ్గర అస్తవ్యస్తం గా ఉన్న డ్రెయినేజీ సమస్యను సర్పంచ్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో డ్రెయినేజీ  నిర్మాణానికి చర్యలు చేపట్టగా ఆ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సౌజన్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉంద న్నారు. చినుకు పడితే మురుగు నీరు అంతా ఇక్కడే చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉన్న కల్వర్టు పల్లం కావటం, పూడుకు పోవటంతో మురుగు పారటం లేదన్నారు. అందరి సహకారంతో కల్వర్టును తొలగించి ఎత్తు పెంచి కొత్తగా కల్వర్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పై నుంచి వచ్చే మురుగు నిల్వ ఉండకుండా కిందకి పోతుందన్నారు. స్థానికులు కూడా డ్రెయినే జీలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పంచాయతీ నుంచి ఎప్పటికప్పుడు డ్రెయి నేజీలో సిల్టు తొలగిస్తున్నామని తెలిపారు. జడ్పీ మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు కలాం, అంజుమన్‌ కమిటీ అధ్యక్షులు షేక్‌ రఫీ, నిడమర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-10T06:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising