డ్రెయిన్ పునరుద్ధరించాలని రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2022-08-04T06:34:18+05:30
పూడ్చివేసిన డ్రెయిన్‌ను పునరుద్దరించాలంటూ లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు బుధవారం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు.
ఘంటసాల : పూడ్చివేసిన డ్రెయిన్‌ను పునరుద్దరించాలంటూ లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు బుధవారం జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఎన్.హెచ్ 2016 జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా పలుగులగండి వద్ద గుండేరుపై నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. బ్రిడ్జికి ఇరువైపులా రహదారిని అభివృద్ధి చేసే క్రమంలో రహదారి వెంబడి ఉన్న డ్రెయిన్లు పూడ్చివేతకు గురయ్యాయన్నారు. దీని కారణంగా పంటపొలాలు ముంపునకు గురికావటంతోపాటు గ్రామపంచాయతీకి సం బంఽధించిన మురుగు నీరు ముందుకు కలదని పరిస్థితులు తలెత్తుతాయన్నారు. తక్షణమే ఎన్.హెచ్ అధికారులు స్పందించి పూడుకుపోయిన డ్రైనేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సర్పంచ్ దున్నా విజయలక్ష్మి, లంకపల్లి సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు గువ్వాబత్తిన నాగేశ్వరరావు, రైతులు మిక్కిలినేని శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట కిరణ్, మోత్కూరి కోటి నాగులు, వీరమాచినేని దశరధి, మల్లేశ్వరరావు, కొల్లూరి సాయి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:34:18+05:30 IST