ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యులపై ఆర్థిక భారం మోపడమేనా అభివృద్ధి అంటే ?

ABN, First Publish Date - 2022-07-02T06:15:30+05:30

మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలపై వివిధ రకాల ఆర్ధికభారాలు మోపడమేనా అభివృద్ధి అంటే అని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు.

మునుకుళ్ల బాదుడే - బాదుడులో శావల దేవదత్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుకుళ్లలో బాదుడే - బాదుడులో శావల దేవదత్‌

ముకుకుళ్ళ(తిరువూరు), జూలై 1: మూడేళ్ల వైసీపీ పాలనలో   ప్రజలపై వివిధ రకాల ఆర్ధికభారాలు మోపడమేనా అభివృద్ధి అంటే అని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు. మునుకుళ్లలో శుక్రవారం మండల టీడీపీ అధ్యక్షుడు వెదురు వెంకటనర్సిరెడ్డి అధ్వర్యంలో బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం  గ్రామంలో  పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.  ప్రజాసమస్యల పరిష్కారం దిశగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని, ప్రజలు  తమ సంపూర్ణమద్దతు ఇవ్వాలన్నారు. బాదుడే- బాదుడు కరపత్రాలు పంపిణీ చేశారు.  నాయకులు గద్దె వెంకటేశ్వరరావు, దొడ్డా లక్ష్మణరావు, సుంకర కృష్ణమోహన్‌, వేమిరెడ్డి వెంకటరెడ్డి, శీలం వెంకటరెడ్డి, వేమిరెడ్డి రాజశేఖరరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, దుబ్బాకు వెంకటేశ్వరరావు, బండి నాగముత్యం, నర్సింగ్‌ నాగరాజు, పర్వతం శ్రీనివాసరావు, ఆషిల్‌లాల్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.


ఆదాయ వనరులు సృష్టించలేక భారాలు

ఆదాయ మార్గలను విస్మరించి, ప్రజలపై ఆర్థికభారం మోపుతుందని టీడీపీనియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ ఆరోపించారు. నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు.  ప్రజారవాణా సంస్థ(ఆర్టీసీ)చార్జిలు పెంచమని పలుమార్లు ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇబ్బడి ముబ్బడిగా చార్జీలు పెంచుకుంటూ పోతున్నారన్నారు. ఇప్పటికే పెరిగి ధరలతో పేదలకు పచ్చడి మెతుకులు కూడ అందని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. బీసీ సెల్‌ అధ్యక్షుడు పర్వతం శ్రీనివాసరావు, కార్యదర్శి పంది శ్రీనివాసరావు,  మీనుగు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising