ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివపార్వతుల ఆరాధనతో విశేష ఫలితం

ABN, First Publish Date - 2022-07-18T06:48:24+05:30

శివపార్వతుల తత్వం అభేదమని, ఇరువురినీ ఆరాధిస్తే ఆశించిన ప్రయోజనం చేకూరుతుందని సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డాక్టర్‌ గరికపాటి నరసింహారావు

మచిలీపట్నం టౌన్‌ : శివపార్వతుల తత్వం అభేదమని, ఇరువురినీ ఆరాధిస్తే ఆశించిన ప్రయోజనం చేకూరుతుందని సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు. పద్మశ్రీ బిరుదు అందుకున్న తరువాత తొలిసారిగా మచిలీపట్నం విచ్చేసిన గరికపాటి నరసింహారావును వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఆదివారం ఘనంగా సత్కరించారు. బుట్టాయిపేట చిట్టి పిళ్లారయ్య స్వామి దేవస్థానంలో నిర్వహించిన  కార్యక్రమంలో డాక్టర్‌ గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ, బోళాశంకరుడు, భక్తవశంకరుడైన శివుడిని ఆరాధిస్తే విశేష ఫలితం లభిస్తుందన్నారు.  అర్ధనా రీశ్వరుడైన పరమశివుని ఆరాధించడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. రుషులు, మహర్షులు శివపార్వతులను ఆరాధించేవారన్నారు. దేవాల యాల్లో శివునితో పాటు పార్వతీదేవిని కూడా అర్చిస్తారన్నారు.  గరికపాటి నరసింహారావును విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ, బి.ఎ్‌స.ఎస్‌. కృష్ణారావు, కాళీపట్నపు ఉమ, కొత్తగుండు రమేష్‌, వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2022-07-18T06:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising