ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ లోక్‌ అదాలత్‌లో 17,768 కేసుల పరిష్కారం

ABN, First Publish Date - 2022-06-27T06:40:28+05:30

జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా సామరస్యంగా కేసులు పరిష్కరించుకోవడం ముదావహమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ అధ్యక్షురాలు అరుణ సారిక అన్నా రు.

పరిష్కార పత్రాన్ని అందజేస్తున్న జిల్లా జడ్జి అరుణసారిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రథమ స్థానంలో కృష్ణాజిల్లా

  జిల్లా జడ్జి అరుణ సారిక

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 26 : జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా సామరస్యంగా కేసులు పరిష్కరించుకోవడం ముదావహమని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ అధ్యక్షురాలు అరుణ సారిక అన్నా రు. మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకుని ఆమె మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు లు పరిష్కారమవుతున్నాయన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా ఆదివారం జిల్లాలో 43 కోర్టు ల్లో  17,768 కేసులు రాజీమార్గంలో పరిష్కా రం అయ్యాయి. మచిలీపట్నం కోర్టులో ఆరు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. 13,179 క్రిమినల్‌, 955 ఎక్సైజ్‌ కేసులు పరిష్కరించి 1,24,200 రూపాయల కాం పౌండ్‌ ఫీజును వసూలు చేశారు.  విధంగా 236 సివిల్‌, 871 చెక్‌బౌన్స్‌ కేసులు, 112 మోటారు వాహన ప్రమాద కేసులకు రూ. 4.69 కోట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు అంగీకరించాయి. 2,415 లిటిగేషన్‌ కేసులను పరిష్కరించి అవార్డులు ప్రదానం చేశారు. మచిలీపట్నంలో 2,538, విజయవాడలో 5091, గుడివాడలో 1961, నందిగామలో 833, నూజివీడులో 965, మైలవరంలో 358, జగ్గయ్యపేటలో 433, బంటుమిల్లిలో 457, కైకలూరులో 361, తిరువూరులో 330, గన్నవరంలో 2265, అవనిగడ్డలో 678, మొవ్వలో 954, ఉయ్యూరులో 543 కేసులను వివిధ కోర్టుల్లో పరిష్కరించినట్టు జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మ మీడియాకు తెలిపారు.  పదవ అడిషనల్‌ జడ్జి నరసింహమూర్తి, ఆరవ అడిషనల్‌ జడ్జి ఎస్‌.చినబాబు, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.అరుణ, శాశ్వత లోక్‌ అదాలత్‌ జడ్జి రామకృష్ణ, మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్‌, కార్యదర్శి  ముసలయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-27T06:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising