ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత పథకాలకు పేదలను బానిసలు చేస్తున్న జగన్‌

ABN, First Publish Date - 2022-07-01T06:13:41+05:30

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలపై ధరలు పెంచేసి, రకరకాల పన్నులు వేసి, ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసి, అరకొర పథకాలు ఇస్తూ, జగన్‌ పేదలను ఉచిత పథకాలకు బాని సలుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు.

మహిళలకు కుట్టుమెషీన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉచిత పథకాలకు పేదలను బానిసలు చేస్తున్న జగన్‌

 ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శ

పటమట, జూన్‌ 30 : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలపై ధరలు పెంచేసి, రకరకాల పన్నులు వేసి, ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసి, అరకొర పథకాలు ఇస్తూ, జగన్‌ పేదలను ఉచిత పథకాలకు బాని సలుగా మారుస్తున్నారని  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. గురువారం అశోక్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో 17, 18 డివిజన్లకు చెందిన 12 మంది మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం రూ. 84 వేలు విలువ చేసే 12 కుట్టు మెషీన్‌లను గద్దె అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు మహిళలను శక్తివంతులు చేసేలా, భర్తలతో పాటు భార్యలు కూడా సంపాదించే ఉద్దేశంతో మెప్మా ద్వారా కుట్టు శిక్షణ కేంద్రాలు నిర్వహించి, వారికి స్టైఫండ్‌ అందించి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మెషీన్లు ఉచితంగా అందజేశారని అన్నారు. చంద్రబాబు ప్రతి కుటుంబం నెలకు రూ. 15 వేలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వారికి పలు రకాల పథకాలు అందజేశారని, జగన్‌ సంవత్సరానికి రూ. 10 వేలు, రూ. 15 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, వారిచ్చేది ప్రభుత్వం వేసే పన్నులు కట్టడానికి సరిపోతుందన్నారు. రాష్ట్ర తెలుగు మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మాదల రాజ్యలక్ష్మి,  ఎస్సీ సెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఇస్త్రం డానియేలు, వేముల దుర్గారావు, ఈశ్వర్‌ పేరేపి, చలసాని రమణ, కొలసాని నాగమణి, కరీం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising