ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరగబడే రోజులు దగ్గర్లోనే..

ABN, First Publish Date - 2022-07-06T07:11:31+05:30

రాష్ట్ర రైతాంగం ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 9న పరిటాలలో రైతు పోరు సభ

- ప్రజలు, రైతుల్లో చైతన్యమే లక్ష్యం

- మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడి

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం), జూలై 5: రాష్ట్ర రైతాంగం ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈనెల 9వ తేదిన కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో పెద్దఎత్తున నిర్వహించనున్న రైతుపోరు బహరంగ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుంటుపల్లి టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో గల 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు కమిటీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం 37నెలల్లో రైతు వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. ప్రజలు, రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. టీడీపీ రైతు కమిటీ నాయకులు జాస్తి రామకృష్ణ, పెదర్ల రవి, చెరుకూరి చినవెంకయ్య, గొట్టుముక్కల సుమంత్‌(బాపు) చుట్టుకుదురు శ్రీనివాసరావు, మైలా సైదులు టీఎన్‌టీయూసీ నాయకులు రెంటపల్లి శ్యామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T07:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising