దీక్ష భగ్నం చేశారు సరే..రైతులకు ఏం న్యాయం చేస్తున్నారు
ABN, First Publish Date - 2022-10-17T06:53:05+05:30
దీక్ష భగ్నం చేశారు సరే..రైతులకు ఏం న్యాయం చేస్తున్నారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు
అవనిగడ్డ టౌన్, అక్టోబరు 16: రైతుల సమస్యల పరిష్కారం కోసం మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేస్తున్న దీక్షను రాజ్యాంగ విరుద్ధంగా భగ్నం చేసిన ప్రభుత్వం రైతులకు ఏం న్యాయం చేస్తుందో చెప్పాలని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం బుద్ధప్రసాద్‌ను ఆయన పరామ ర్శించారు. కోడూరు మండలంలో అవుట్ ఫాల్స్లూయిస్ల నిర్వహణ సరిగా లేకపోవటంతో మూడేళ్లుగా నాలుగు గ్రామాల ప్రజలు ఒక్క పంట కూడా తీయలేక పోయారని, దీనికి డ్రెయిన్ల మరమ్మతుల పేరుతో వైసీపీ నేతలు చేసిన దోపిడీనే కారణమని ఆయన ఆరోపిం చారు. నిరసనను ఆపేందుకు, దీక్షను భగ్నం చేయడంపై పెట్టిన శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం కోసం పెట్టి ఉంటే బాగుండేదన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 20న ముఖ్యమంత్రి పర్యటనలోపు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకుని అభి వృద్ధిపై దృష్టిసారించాలని గర్జనల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని హితవు పలి కారు. నియోజకవర్గ పరిశీలకులు పంతాని మురళీ ధరరావు, యాసం చిట్టిబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే రాఘవ, ఘంటసాల రాజమోహనరావు, బచ్చు రఘునాథ్, మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నిరసన తెలిపే హక్కు లేదా?: గుమ్మడి
వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై నిరసన కార్య క్రమాలు చేసుకునే హక్కు కూడా లేదా అని నాటక అకా డమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రశ్నించారు. బుద్ధప్రసాద్‌ను కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న బుద్ధప్రసాద్ అడిగిన డిమాండ్‌ను ప్రభుత్వం సాను కూలంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కళాకారులు పడుతున్న ఇబ్బం దులను ఆయన ప్రస్తావించారు. కళాకారులను ఉసురు పెట్టిన ఏ ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదని, ప్రభు త్వానికి పోయేకాలం దాపురించే ఇలాంటి అణచివేత కార్యక్రమాలకు పాల్పడుతుందని అన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం కళాకారులను వినియోగించుకునే వారని, తద్వారా ఎంతో మంది కళాకారులకు ఉపాధి లభించేదని, కానీ నేడు కళాకారులకు కనీసం కార్యక్రమాలు ఇవ్వకపోగా, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలూ ఇవ్వకుండా వారి ఉసురుపోసుకుంటుందన్నారు.
నిలకడగా బుద్ధప్రసాద్ ఆరోగ్యం
గడిచిన 15 గంటలుగా అందిన వైద్యసేవలతో మండలి బుద్ధప్రసాద్ ఆరోగ్యం కొంతమేర మెరుగైంది. దీక్ష సమయంలో పల్స్రేట్ 58 లోపుగా పడిపోవటంతో వైద్యుల సూచనలతో పోలీసులు బలవంతంగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. శనివారం రాత్రే డిశ్చార్జై ఇంటికి వచ్చారు. వ్యక్తిగత వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆయనను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కళాకారులు, రైతులు తరలి వచ్చారు. విశ్రాంతి లేని కారణంగా నీరసంగానే ఉన్నారు.
Updated Date - 2022-10-17T06:53:05+05:30 IST