ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాట్రాయిలో డేంజర్‌ టర్నింగ్స్‌

ABN, First Publish Date - 2022-01-24T06:09:07+05:30

మండల కేంద్రం చాట్రాయిలో పలు రోడ్ల మలుపులు ప్రమాదకరంగా మారటంతో వాహనచోదకులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజల వినతి

చాట్రాయి : మండల కేంద్రం చాట్రాయిలో పలు రోడ్ల మలుపులు ప్రమాదకరంగా మారటంతో వాహనచోదకులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పవర్‌పేట, సచివాలయం, మెయిన్‌ సెంటర్‌, పాములపాటి నరశింహారెడ్డి ఇంటి వద్ద ఉన్న రహదారి మలుపులు ప్రమాదకరంగా మారాయి. రోడ్లు ఇరుకుగా ఉండటం, మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించే అవకాశం లేకపోవటం, అతివేగం కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నారు. కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే రహదారిలో చాట్రాయి ఉండటంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్డు మలుపుల్లో స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం : ఆర్‌అండ్‌బీ

చాట్రాయిలో ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మలుపుల్లో స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బి ఏఏఈ అచ్చారావు అన్నారు. ఇక్కడ రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య వస్తోందని, వీవీ రోడ్డు పరిధిలోని నర్సాపురం నుంచి చాట్రాయి మీదుగా తమ్మిలేరు ప్రాజెక్ట్‌ రెగ్యూలేటర్‌ వరకు 15 కిమీ దూరం డబుల్‌ రోడ్డుగా విస్తరించటానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. నిధులు మంజూరైతే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-01-24T06:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising