ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల కోత.. పన్నుల మోత

ABN, First Publish Date - 2022-07-04T06:05:22+05:30

ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ (రాంబాబు) అన్నారు.

జి.కొండూరులో టీడీపీ నేతల నిరనస
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు

జి.కొండూరు, జూలై 3: ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ (రాంబాబు) అన్నారు.  చార్జీల పెంపును నిరసిస్తూ  ఆదివారం జి.కొండూరులో ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌ మూడేళ్ల పాలనలో ప్రజలను అన్ని విధాలుగా బాదుతూనే ఉన్నాడని ధ్వజమెత్తారు.  తక్షణం  పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పజ్జూరు రవికుమార్‌ (వెంకయ్య), లంక రామకృష్ణ, ఉయ్యూరు వెంకట నరసింహారావు, సుకవాసి శ్రీహరి, మన్నం వెంకట చౌదరి, ధనేకుల శ్రీకాంత్‌, అంకెం సురేష్‌, గుడిపూడి శివశంకర్‌, నూతక్కి రాజారావు, వీసం ప్రభాకరరావు, నూతక్కి నాగేశ్వరరావు, బాధినేని సీతారామరాజు పాల్గొన్నారు. 

ఎ.కొండూరు : ప్రభుత్వం ఆర్‌టీసీ చార్జీ పెంచి ప్రజలకు ప్రయాణ సౌకర్యాలను దూరం చేస్తోందని తిరువూరు టీడీపీ ఇన్‌ చార్జీ శావల దేవదత్‌ ఆరోపించారు. చీమలపాడు నుంచి కాకర్ల వరకు బస్సు లో నేతలు ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం  వల్లంపట్ల గ్రామంలో బాదుడే-బాదుడు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదత్‌ మాట్లాడుతూ జగన్‌ మూడేళ్ల పాలనాలో రాష్ట్రం అన్ని విధాలగా వెనుక బడిపోయిందన్నారు.  రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్‌ గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గడ్డి కృష్ణారెడి, అలవాల రమేష్‌రెడ్డి, మునియ్య, డేవిడ్‌రాజ్‌, రంగారావు, చైతన్య, ఏలియాబాబు పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-04T06:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising