Jawahar Reddy: ఏపీ సచివాలయంలో సీఎస్ ఆకస్మిక తనిఖీలు
ABN, First Publish Date - 2022-12-16T11:40:29+05:30
ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
అమరావతి: ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం మూడవ బ్లాకు వద్ద ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారు, సమయానికి వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మహిళాశిశుసంక్షేమ, మైనార్టీ వెల్ఫేర్, పర్యటక శాఖల్లో ఉద్యోగుల పని సమయాన్ని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఎంత అటెండెన్స్ ఉంది ఎంత మంది వచ్చారు అని వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగుల సీట్‌ల వద్దకు వెళ్లి మరీ తనిఖీ చేశారు. సచివాలయానికి వస్తు వస్తునే సీఎస్ జవహర్ రెడ్డి మూడవ బ్లాక్‌కు వెళ్లి తనిఖీలు చేశారు.
Updated Date - 2022-12-16T11:40:58+05:30 IST