ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరలను నియంత్రించాలని సీపీఎం పాదయాత్ర

ABN, First Publish Date - 2022-05-29T06:10:42+05:30

అధిక ధరలను నియంత్రించాలని, ఈ నెల 30న జరిగే కలెక్టరేట్‌ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం 21వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంక కల్పనా ప్రింట్స్‌ రోడ్డు వద్ద నుంచి సబ్‌ వే వరకు సీపీఎం నాయకులు ప్రచార పాదయాత్ర నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధిక ధరలను నియంత్రించాలని సీపీఎం పాదయాత్ర

కృష్ణలంక, మే 28 :అధిక ధరలను నియంత్రించాలని, ఈ నెల 30న జరిగే కలెక్టరేట్‌ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం 21వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంక కల్పనా ప్రింట్స్‌ రోడ్డు వద్ద నుంచి సబ్‌ వే వరకు సీపీఎం నాయకులు ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ మతం, కులం పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 30న అన్ని కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రజలంతా ఈ ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని కాశీనాథ్‌ కోరారు. సీపీఎం నాయకులు కోరాడ రమణ, లక్ష్మణ్‌కుమార్‌, తాడి రమణ, శివాజీ, గోపి తదితరులు పాల్గొన్నారు. 

రాణిగారితోట: అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ రాణిగారితోట 17వ డివిజన్‌ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వామపక్షాలు కదిలాయని, దేశ వ్యాప్తంగా ఈ నెల 30న అన్ని కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా రాష్ట్రంలో నిర్వహించే ధర్నాల్లో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని కోరారు. నాయకులు ఎన్‌.హరినారాయణ, తమ్మిన చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising