ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhu: జాతీయ పార్టీని కేసీఆరే కాదు.. ఎవరైనా పెట్టొచ్చు...

ABN, First Publish Date - 2022-09-30T20:24:02+05:30

విజయవాడ (Vijayawada): నగరంలో సీపీఐ (CPI) జాతీయ సెమినార్ సన్నాహక సదస్సు జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): నగరంలో సీపీఐ (CPI) జాతీయ సెమినార్ సన్నాహక సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కోబాడ్ గాంధీ (Gandhi), నారాయణ (Narayana), కూనంనేని (Kunamneni), మధు (Madhu), చాడ వెంకటరెడ్డి (Chada Venkat reddy) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ జాతీయ పార్టీని కేసీఆరే కాదు.. ఎవరైనా పెట్టొచ్చునని అన్నారు. కేసీఆర్ (KCR) పెట్టబోయే జాతీయ పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన జాతీయ పార్టీ పెడుతున్నారని.. ఇది స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. జాతీయ స్థాయిలో ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకునే కంటే.. ఎన్నికలయ్యాక ఒకే వేదిక మీదకు వస్తే మంచిదనేది లెఫ్ట్ పార్టీల భావనని, ఎన్నికలకు ముందే కలవాలంటే.. అదే పెద్ద వివాదం అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పని చేయాలని పిలుపిచ్చారు. సీఎం జగన్ కేంద్రం ఒత్తిళ్లకు లొంగుతున్నారని, కేంద్రం ఒత్తిడితోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని మధు విమర్శించారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో జగన్ కూడా కలిసి రావాలన్నారు.

Updated Date - 2022-09-30T20:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising