లక్ష్యం లేని యువతకు అవకాశాలు కష్టం
ABN, First Publish Date - 2022-12-15T01:12:16+05:30
లక్ష్యం లేని యువత ఉపాఽధి అవకాశాలను పొందటంలో వెనుకబడతారని కేవలం 5 శాతం మంది మాత్ర మే లక్ష్యం నిర్దేశించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని నగర పోలీసు కమిషనర్ కాంతిరా ణా అన్నారు.
మొగల్రాజపురం, డిసెంబరు 14 : లక్ష్యం లేని యువత ఉపాఽధి అవకాశాలను పొందటంలో వెనుకబడతారని కేవలం 5 శాతం మంది మాత్ర మే లక్ష్యం నిర్దేశించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని నగర పోలీసు కమిషనర్ కాంతిరా ణా అన్నారు. పబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులకు డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చే సిన ఉచిత అవగాహన సదస్సు బుధవారం కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యువత లక్ష్యా న్ని నిర్దేశించుకుని దానికోసం రోజుకు 16 గంటల పాటు సిద్ధం కావాలన్నారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సివిల్ స ర్వీస్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కొన్ని మెళకువుల గురించి విద్యార్థులకు వివరించారు. సర్కిల్ చైర్మన్ డాక్టర్ లక్ష్యయ్య, సిద్ధార్థ ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T01:12:17+05:30 IST