ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు 803

ABN, First Publish Date - 2022-01-27T06:56:07+05:30

జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసుపత్రుల్లో 5,600 మంది 


విజయవాడ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 748 మందికి వైరస్‌ సోకగా, బుధవారం కొత్తగా మరో 803 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,26,819కి చేరింది. మరణాల సంఖ్య 1,482 వద్ద నిలకడగా ఉంది. జిల్లాలో వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,19,737 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 5,600 మంది చికిత్స పొందుతున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని భావిస్తున్నారు. 


శాయుపురంలో కరోనా కలకలం

శాయిపురం (ఉయ్యూరు), జనవరి 26 : ఉయ్యూరు మండలం శాయిపురం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంగళవారం కరోనా టెస్ట్‌ చేయగా, ప్రధానోపాధ్యాయునితో పాటు మరో ఉపాధ్యాయుడికి, ఆరుగురు విద్యార్థులకు, మధ్యాహ్న భోజన ఏజెన్సీకి చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణయింది. దీనితో సర్పంచ్‌ జాన్‌బాషా పాఠశాల ఆవరణను శానిటైజ్‌ చేయించి, గ్రామంలో బ్లీచింగ్‌, స్ర్పేయింగ్‌ చేయించారు. 

Updated Date - 2022-01-27T06:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising