ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానానికి సహకరించాలి

ABN, First Publish Date - 2022-10-07T05:55:42+05:30

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి కోరారు.

రాజకీయపార్టీల నాయకులతో ఆర్డీవో సమీక్ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి సమీక్ష

తిరువూరు, అక్టోబరు 6: ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి కోరారు.  రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో గురువారం  అఖిలపక్ష నాయకులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలో 73 శాతం ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం పూర్తి  అయిందని, మిగిలిన 27 శాతం పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి 1400 ఓటర్లు పైబడి ఉంటే మరో పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నవంబరు 9 నుంచి డిసెంబరు 8 వరకు ఓటర్ల జాబితాలో చేర్పులు తొలగింపులకు దరఖాస్తులు తీసుకుంటారని, 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేశంలో తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు,  తహసీల్దార్‌లు ఎన్‌.సురేష్‌బాబు, జి.బాలకృష్ణారెడ్డి, కె.లక్ష్మి, వెంకటేశ్వర్లు,  వివిధపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising