నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN, First Publish Date - 2022-12-16T00:09:16+05:30
30వ డివిజన్‌లో జరుగుతున్న యూజీడీ, వాటర్‌పైపు లైన్ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ధేశించిన సమయలో పూర్తి చేయాలని కార్పొరేటర్ జానారెడ్డి సూచించారు.
సత్యనారాయణపురం, డిసెంబర్ 15 : 30వ డివిజన్‌లో జరుగుతున్న యూజీడీ, వాటర్‌పైపు లైన్ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ధేశించిన సమయలో పూర్తి చేయాలని కార్పొరేటర్ జానారెడ్డి సూచించారు. డివిజన్‌లో జీవీఆర్ నగర్, దావుబుచ్చయ్య కాలనీ, వినాయకనగర్‌లో జరుగుతున్న యూజీడీ పనులను గురువారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. డివిజన్‌లో జరుగుతున్న పనుల వివరాలను నగరపాలక సంస్థ ఏఈ అరుణ్‌దేవ్ వివరించారు.
Updated Date - 2022-12-16T00:09:17+05:30 IST