ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోంది: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-07-21T16:59:18+05:30

పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): పోలవరం (Polavaram) అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఏపీ (AP) బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Viraraju) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు (TRS Leaders) మాట్లాడుతున్నారని, పోలవరంను ప్రశ్నిస్తే... తెలంగాణ (Telangana) ఏర్పాటును ప్రశ్నించి నట్లేనని, రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారన్నారు. విభజన తరువాత భద్రాచలం ఆలయాన్ని (Bhadrachalam temple)‌, ‌మరో రెండు మండలాలు‌ తెలంగాణకు కేటాయించారన్నారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్‌కు‌ నీరు ఇవ్వాలని‌ ఆనాడు వైయస్ పనులు చేపట్టారని, దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ (Rayalaseema) తీవ్రంగా నష్టపోయిందన్నారు.


పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని, అప్పుడో మాట.. ఇప్పుడో మాట అనేది సరికాదని సోమువీర్రాజు అన్నారు. పోలవరం విషయంలో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. షెకావత్ (Shekavat) ఏపీ పర్యటన తరువాత 15రోజులకొక సారి రివ్యూ చేస్తున్నారని చెప్పారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతోందన్నారు. ఏపీలో పరిణామాలను బీజేపీ‌ జాతీయ నాయకత్వానికి వివరిస్తామని సోమువీర్రాజు అన్నారు.

Updated Date - 2022-07-21T16:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising