ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో మెరుగైన సేవలందించండి

ABN, First Publish Date - 2022-08-18T06:09:15+05:30

సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

సచివాలయాల సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచివాలయాల్లో మెరుగైన సేవలందించండి

 కలెక్టర్‌ దిల్లీరావు 

కలెక్టరేట్‌, ఆగస్టు 17 : సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

 పటమటలోని ఖన్నా నగర్‌ 65, 66 వార్డు సచివాలయాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రికార్డులను పరిశీలించి, అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును ఆరా తీస్తూ అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పథకాల లబ్ధి చేకూరాలని సూచించారు.

నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి

అజిత్‌సింగ్‌నగర్‌ : అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. కోటి 8 లక్షల నిధులతో చేపట్టనున్న 9 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు పరిశీలించిన స్థలంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising