ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎ్‌సఎంఈలకు పూర్తి సహకారం

ABN, First Publish Date - 2022-06-28T07:31:31+05:30

యువతకు ఉపాధి కల్పించే ఎంఎ్‌సఎంఈలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. అంతర్జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 27 : యువతకు ఉపాధి కల్పించే ఎంఎ్‌సఎంఈలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. అంతర్జాతీయ ఎంఎ్‌సఎంఈ దినోత్సవం సందర్భంగా సోమవారం పోతేపల్లిలోని జ్యూయలరీ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. యువతకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజ్‌లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాత యూనిట్లకు చేయూతనిస్తామన్నారు. జిల్లాలో అవగాహన కల్పించేందుకు ఎంఎ్‌సఎంఈ సంఘాల ప్రతినిధులతో త్వరలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ వెంకట్రావు, ఎంఎ్‌సఎంఈ డైరెక్టర్‌ వరలక్ష్మి, ఏపీఐఎ్‌సఈ జేపీ సాంబశివరావు, ఏపీఎ్‌సజే జేపీ శ్రీనివాస్‌, ఎంఎ్‌సఎంఈ క్లస్టర్ల ప్రతినిధులు చలమలశెట్టి నరసింహారావు, పి.సత్యనారాయణ, పి.సుబ్బారావు, ఎల్‌డీఎం సాయిరామ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాలోని ఉత్తమ పారిశ్రామిక వేత్తలను సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. జ్యూయలరీ పార్కు ఆవరణలో మొక్కలు నాటారు.

పుట్టగుంటకు పురస్కారం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తులను ఎగుమతి చేసే విభాగంలో100 శాతం బెస్ట్‌ ఎక్స్‌పోర్టర్‌గా బొమ్ములూరులోని 1947 ఐఎన్‌సీ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది. పారిశ్రామికవేత్తల సదస్సులో కలెక్టర్‌ రంజిత్‌బాషా పురస్కారాన్ని ఫాక్టరీ ఎండీ పుట్టగుంట సతీ్‌షకుమార్‌కు అందజేశారు. 


Updated Date - 2022-06-28T07:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising