ఇంధనాన్ని పొదుపుగా వాడండి : కలెక్టర్
ABN, First Publish Date - 2022-12-15T01:11:15+05:30
ఇంధనాన్ని పొ దుపు వాడి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ దిల్లీరావు అన్నారు.
లబ్బీపేట, డిసెంబర్ 14 : ఇంధనాన్ని పొ దుపు వాడి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ దిల్లీరావు అన్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో బుధవా రం భౌతికశాస్త్ర విభాగం, ఏపీ ఎనర్జీ కన్‌వర్షన్ మిషన్ సంయుక్త ఆధ్యర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాలు పురస్కరించుకొని ఇందన పొదుపు సామర్ధ్యం పెంచేందుకు ఉపయోగపడే సాంకేతికతపై వ్యాసరచన పోటీలు, పోస్టర్ ప్రదర్శన వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం అ వగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రా రంభించిన ఆయన మాట్లాడుతూ ఇంధనాన్ని పొ దుపు వాడుకోవాలని దానిపై విద్యార్థులు ప్రతి ఒ క్కరికీ అవగాహన కల్పించాలని, అదేవిధంగా కాలుష్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వివిధ పో టీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అవగాహన ర్యాలీ బందర్ రోడ్డులో నిర్వహించారు. డైరెక్టర్ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ ఎస్.కల్పన, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T01:11:16+05:30 IST