ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మో సీఎం కాన్వాయ్‌!

ABN, First Publish Date - 2022-09-24T06:32:10+05:30

ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి కదులుతున్నారంటే చాలు నగరం లో వాహనదారులు వణికిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం రూటో వైపు.. పోలీసుల రూటు మరోవైపు..!

మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాల నిలుపుదల 

వాహనదారుల తీవ్ర అసహనం

ఆంధ్రజ్యోతి - విజయవాడ : ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి కదులుతున్నారంటే చాలు నగరం లో వాహనదారులు వణికిపోతున్నారు. ఆయన ప్ర యాణించే మార్గంలో వాహనదారులకు చుక్కలకు కనిపిస్తున్నాయి. సీఎం కాన్వాయ్‌ ఎంతవేగంతో దూ సుకెళ్తున్నా ఆయన ఆగమనానికి ముందు నుంచే ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. సాధారణంగా సీఎం వెళ్లే మార్గంలో పోలీసు ు ట్రాఫిక్‌ను నిలుపుదల చేయడం సహజం. జంక్షన్లలో మాత్రం రెండు వైపులా ట్రాఫిక్‌ను ఆపుతున్నా రు. పోలీసులు మాత్రం సీఎం వెళ్లే మార్గంలో మా త్రం దారుణంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వి నిపిస్తున్నారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లినా, విమానాశ్రయం నుంచి తాడేపల్లికి బయలుదేరినా రామవరప్పాడు రింగ్‌ మీదుగానే వెళ్లాలి. ఇక్కడ జాతీయ రహదారికి ఇంటర్‌ జంక్షన్‌ ఉన్నందున రెండు వైపులా ట్రాఫిక్‌ నిలుపుదల చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ మార్గానికి సంబంధంలేని మార్గాల్లోనూ పోలీసులు వాహనాలను నిలుపుదల చేయడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్‌ శుక్రవారం కుప్పం పర్యటనకు వెళ్లారు. తిరిగి సాయంత్రానికి వచ్చారు. విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు, తిరిగి తాడేపల్లికు వచ్చేటప్పుడు రామవరప్పాడు రింగ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌ను నిలిపేశారు. 

రామవరప్పాడు రింగ్‌ నుంచి ఇన్నరింగ్‌ రోడ్డుకు వెళ్లే మార్గంలో రెండు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. ఈ రెండింటికి అవతలి వైపున నున్న వైపు వెళ్లే మార్గంలో రామవరప్పాడు వైపు వచ్చే ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు. ముస్తాబాద్‌ రోడ్డులోకి వెళ్లిపోతామన్నా వదల్లేదు. సీఎం కాన్వాయ్‌ రామవరప్పా డు రింగ్‌ వరకు రావడానికి గంట ముందు నుంచి వాహనాలను నిలుపుదల చేయడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. సీఎం రాకపోకలు సాగించే ప్రతిసారి ఇదెక్కడి తలనొప్పి అని వాహనదారులు విసుక్కుంటున్నారు.

Updated Date - 2022-09-24T06:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising