ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు ఒంటరిగా గెలిచే సత్తా లేదు

ABN, First Publish Date - 2022-07-02T06:42:52+05:30

చంద్రబాబుకు ఒంటరిగా గెలిచే సత్తా లేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్లీనరీలో మంత్రి జోగి రమేష్‌ 

అవనిగడ్డ టౌన్‌, జూలై 1 : 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే సత్తా లేదని, ఆ పార్టీ ప్రజల్లో ఎప్పుడో చనిపోయిందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలో జరిగిన వైసీపీ ప్లీనరీలో జోగి రమేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వారి మనస్సులో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని, గడప గడపకు తిరుగు తుంటే వారి ప్రేమ వారి మాటల్లో వ్యక్తమవుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కొందరు జగన్మోహన్‌రెడ్డి పేదలకు పం చేస్తున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారని, వారు కొనే నిత్యావసరాలు, మద్యంపైన, పెట్రోల్‌పైన వసూలు చేసే పన్నులను తిరిగి ఆ పేదవాడికే ఇస్తున్నారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.  

 బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, ఎదురుమొండి దీవుల వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఏటిమొగ - ఎదురుమొండి వారధి కల త్వరలోనే సాకారమవుతుందని, ఇందుకోసం ఇప్పటికే రూ.130 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.  ఈ కార్యక్రమం లో ప్లీనరీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, పరిశీలకుడు గౌతంరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఉప్పాల హారిక, సింహాద్రి వికాస్‌, కడవకొల్లు నరసింహారావు, ఆరు మండలాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising