మచిలీపట్నం - కర్నూలు రైలు వేళల్లో మార్పు
ABN, First Publish Date - 2022-08-25T06:19:59+05:30
మచిలీపట్నం - కర్నూలు రైలు వేళల్లో మార్పు
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 24: మచిలీపట్నం నుంచి కర్నూలు కు వెళ్లే రైలు వేళల్లో మార్పులు చేశారని, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంఽధాల అధికారి సీహెచ్ రాజేష్ తెలిపారు. మచిలీపట్నం- కర్నూలు ప్రత్యేక రైలు 07067 మచిలీపట్నం నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరస రావుపేట, మర్కాపురం, డోన్‌ల మీదుగా కర్నూలు సిటీకి మరునాడు ఉదయం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఏసీ టూటైర్ కోచ్, స్లీపర్ క్లాస్ కోచ్, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్‌లు ఉన్నాయన్నారు. కర్నూలులో రాత్రి 8 గంటలకు బయలుదేరి మచిలీపట్నం ఉదయం 7.05 గంటలకు చేరుతుందన్నారు.
Updated Date - 2022-08-25T06:19:59+05:30 IST