ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్పై డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2022-09-23T18:12:43+05:30

సీనియర్జ ర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్పై ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు (Ankababu) అరెస్ట్పై ఏపీ డీజీపీ (DGP)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ (Letter) రాశారు. అంకబాబు అరెస్ట్ అక్రమమని, వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ను వాట్సాప్ పోస్ట్ కారణంగా.. అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. అనారోగ్య సమస్యలతో ఉన్న అంకబాబును వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖ ద్వారా డీజీపీని కోరారు.


సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారనే నెపంతో నోటీసులు లేకుండా 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అరెస్టు చేయడం దారుణమని అమరావతి  బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. అంకబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మొదట టీడీపీ నాయకులు, క్రీయాశీలక కార్యకర్తలతో మొదలైన అక్రమ అరెస్ట్లు.. ఆ తర్వాత ప్రశ్నించే గొంతుకులపై, రాజధాని ఉద్యమకారులపై ప్రయోగించారని మండిపడ్డారు. తాజాగా జర్నలిస్ట్లను కూడా వదలబోమనే సందేశం ఇస్తున్నారని బాల కోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును గత రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ (Whatsapp)లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం... ఇటీవల ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత అంశంలో.. పోస్టింగ్ ఫార్వార్డ్ చేయడం వల్ల అంకబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అంకబాబుపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సీఐడీ పోలీసులు అభియోగం మోపుతూ ఐపీసీ 153(A), 505(2), రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అంకబాబును కోర్టులో హాజరుపర్చనున్నారు.

Updated Date - 2022-09-23T18:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising