ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kesineni Nani: బెజవాడ ఎంపీ కూతురి నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు కుటుంబం సందడి

ABN, First Publish Date - 2022-08-01T22:42:54+05:30

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌(నాని), పావని దంపతుల ద్వితీయ కుమార్తె కేశినేని శ్వేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కాజా రామనాథం మనుమడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌(నాని), పావని దంపతుల ద్వితీయ కుమార్తె కేశినేని శ్వేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కాజా రామనాథం మనుమడు కాజా రఘు వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.



నిశ్చితార్థ వేడుకలో నందమూరి వసుంధర, ఈనాడు సంస్థల అధినేతలు చెరుకూరి కిరణ్, శైలజ దంపతులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురామ్, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్రకుమార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మహువా మోయిత్రా, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, టి.డి.జనార్ధన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - 2022-08-01T22:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising